Wednesday, November 29, 2023

పాలేరులో ఈసారి తుమ్మల పోటీ ఖాయం.. టీఆర్ ఎస్ లీడ‌ర్ల ర‌హ‌స్య భేటీలో వెల్ల‌డి

ప్ర‌భ న్యూస్‌, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు శుక్రవారం రహస్య సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు , ముఖ్య నేతల సమావేశం నేపథ్యంలో పాలేరులో పోటీకి తుమ్మల సిద్ధం అంటూ ఆయ‌న అనుచరగణం అంతా ఒక చోట బేటీ అయి సమావేశం నిర్వహించారు.

త్వరలోనే తుమ్మల అభిమానులతో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించాలని, సత్తా చాటుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యమేనని పలువురు నేతలు పేర్కొనడం విశేషం. ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్ లో జరిగిన ఈ సీక్రెట్ సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు దూరంగా ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement