Monday, April 29, 2024

TSPSC – పేపర్ లీకేజ్ లో మరో 10 మంది అరెస్ట్

హైదరాబాద్ – టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఓవైపు సిట్.. మరోవైపు ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలతో మరో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్టు చేశారు సిట్ పోలీసులు. నిందితులు విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్టు చేస్తున్నారు . మరికొన్ని అరెస్ట్ లు ఉంటాయని సిట్ ప్రకటించింది. ఇక మరికొంత మందిని అరెస్టు చేసేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సిట్‌ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement