Sunday, April 21, 2024

TS – విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు రైతులు దుర్మ‌ర‌ణం ..

దేవ‌ర‌క‌ద్ర – విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి చెందిన విషాధ ఘటన చిన్నచింతకుంట మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా , చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన కుర్వ మల్లప్ప (50) గాజా మోహన్ రెడ్డి(55) శుక్రవారం ఉదయం తమ పొలాల వద్ద ఉన్న మోటార్‌ను రిపేరు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రక్క పొలాల రైతులు చూసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నచింతకుంట ఎస్సై శేఖర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా జిల్లా ఆసుపత్రికి తరలించారు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement