Monday, May 6, 2024

TS – మేడిగ‌డ్డ‌ను ప‌రిశీలించిన రేవంత్ రెడ్డి బృందం..

జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లి మేడిగడ్డ వద్ద గోదావరి నది పై బిఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష్మి బ్యారేజ్ ను నిర్మించగా మూడెళ్ళలోనే బ్యారేజ్ పిల్లర్లు కుంగి పోవడంతో ప్రాజెక్ట్ లోని లోపాలను ఎత్తి చూపేందుకు , వాస్తవాలను ప్రజలు తెలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మంగళవారం ఉదయం అసెంబ్లీ నుండి నేరుగా మంత్రులు, ఎమ్మెల్సి ల బృందంతో కలిసి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులలో మేడిగడ్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రుల బృందం, ఇరిగేషన్ అధికారులతో కలిసి లక్ష్మీ బ్యారేజ్ కాపర్ డ్యాం కుడివైపు కు చేరుకొని బ్లాక్ 7లో పగిలిన పిల్లర్ 19,20,21,22ను సీఎం మంత్రులతో కలిసి కుంగిన పిల్లర్ లను,పగుల్లను పరిశీలించారు.

అనంతరం అక్కడ బ్యారేజీలో కుంగిన పిల్లర్లు, బ్యారేజీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డ చేప‌ట్టిన ప‌నులు వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.. ఆ త‌ర్వాత అధికారులు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement