Tuesday, April 30, 2024

TS – జై తెలంగాణ అంటే ధ‌ర్డ్ డిగ్రీనా …ఎస్పీని నిల‌దీసిన కెటిఆర్

ప‌ర‌కాల – జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..?అంటూ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ‌క్తం చేశారు.. ప‌ర‌కాల‌లో పోలీసుల ధ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగంతో తీవ్రంగా గాయ‌ప‌డిన బిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ను ఆయ‌న నేడు ప‌రామ‌ర్శించారు..అనంత‌రం ఆయ‌న ఈ చ‌ర్య‌పై స్వయంగా వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝాతో ఫోన్లో మాట్లాడారు.. బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టడమే కాకుండా హౌజ్ అరెస్ట్ చేశారంటూ ఎస్సీకి చెప్పారు.. కాగా, కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న కేటీఆర్, వారిపై న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు..
గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement