Tuesday, October 8, 2024

TS – ర్యాగింగ్‌పై ఎమ్మెల్సీ కవిత ఆందోళన – శాసనమండలిలో చర్చకు వినతి

రామగుండం మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటనపై నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్‌కు లేఖ రాశారు.ర్యాగింగ్‌ అనేది అమానవీయమని, మానవ హక్కుల ఉల్లంఘన అని కవిత వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్‌ తన లేఖలో చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement