Sunday, October 13, 2024

TS – విజయ సంకల్ప యాత్ర వాల్ పోస్టర్ విడుదల చేసిన డీకే అరుణ

మక్తల్, ఫిబ్రవరి19(ప్రభన్యూస్) – భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ నెల 20 నుండి బస్సు యాత్ర వాల్ పోస్టర్ల‌ను ఇవాళ సాయంత్రం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని రోడ్డు బవనాల శాఖ అతిథిగృహంలో మాజీ మంత్రి బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డికె.అరుణ విడుదల చేశారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగా పదేళ్ళలో బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజల నుండి సూచనలు తీసుకోవడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు.

ఈనెల 20న మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రం నుండి విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందన్నారు.ఈ యాత్ర కు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ,రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని యాత్రను ప్రారంభిస్తారని అన్నారు .మక్తల్ ,ఊట్కూర్ మీదుగా నారాయణపేట వరకు చేరుకుంటుందన్నారు. మూడున్నర రోజులపాటు పాలమూరు పార్లమెంట్ పరిధిలో యాత్ర కొనసాగుతుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుండి విజయ సంకల్ప యాత్రలో ప్రారంభమవుతుందని డికె.అరుణ తెలిపారు. ఈ యాత్రలో పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య ,డోకూర్ పవన్ కుమార్,తిరుపతి రెడ్డి, కర్ని స్వామి ,దేవరింటి నరసింహారెడ్డి, జి. బలరాం రెడ్డి, మేర్వ రాజు,డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement