Tuesday, June 18, 2024

TS: 16 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ..

రాష్ట్రంలో పనిచేస్తున్న 16 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పదోన్నతి పొందిన మున్సిపల్ కమిషనర్లతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నియమావలి ప్రకారం మూడేళ్ల పాటు ఒకే ప్రాంతంలో పనిచేసిన కమిషనర్లను బదిలీ చేశారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న మరికొంతమంది కమిషనర్లను సోమవారం బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.

పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని పెద్దపల్లి మెప్మా పీడీగా, లక్షట్ పేట మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ గా, పదోన్నతి పొందిన మల్లికార్జున్ ను సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ బదిలీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement