Tuesday, April 30, 2024

Andhra Pradesh Floods – కోన‌సీమ‌లో మ‌హోగ్ర గోదావ‌రి…

ఐ. పోలవరం, ప్రభన్యూస్‌ :
కోనసీమలో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. నెలరోజుల వ్యవధిలో మూడు సార్లు గోదావరికి వరద ముంచెత్తడంతో లంక ప్రజలు బెంబేలె త్తిపోతున్నారు. కోనసీమలో ప్రధాన నదులైన వృద్ధ గౌతమి, వశిష్ట వైనతేయ గోదావరి పాయలకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటితో కోనసీమలో నదులన్నీ ఉధృతంగా ప్రవహస్తున్నాయి. ఇప్పటికే కోనసీమలో దాదాపు 60 లంక గ్రామాల ప్రజలు పునరావాసం కోసం జిల్లా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందో అనే భయంతో పీడిస్తోంది. లంక గ్రామాల ప్రజలతోపాటు లోతట్టు ప్రాంతాలవారిని సు రక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. జిల్లా కలెక్టర్‌ హమాన్షు శుక్లా, అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు కోనసీమ జిల్లాలో అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలకు హ అలెర్ట్‌ ప్రకటించారు. కోనసీమ జిల్లాలో అన్ని త హశీల్దార్‌ కార్యాలయాలను ఇప్పటికే వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌, ఆర్డిఓలు సంకేతాలు పంపారు.

ఏటిగట్లను తాకిన ప్రవాహం
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హచ్చరిక జారీ చేసే అవకా శాలు ఉన్న దృష్ట్యా గోదావరి వరద కోనసీమలో అన్ని ఏటిగట్లను తాకేసింది. పల్లప్రాంతాలు జలమయమ య్యా యి. ఎదుర్లంక పాతరేవు వద్ద కాలనీ వరదనీటిలో మునిగి పోయింది. ఈసారి వరద జలవిలయం ప్రకటించేలా ఉంది. యానాం…. ఎదుర్లంక( బాలయోగి వారధి )వద్ద గోదావరి వర ద వృద్ధ గౌతమి నది ప్రవా#హం రెట్టింపు స్థాయిలో పరవళ్ళు త్రొక్కుతున్నది. మత్స్యకారులు జీవనోపాధి లేక పడవలపైనే నివాసం ఏర్పాటు చేసుకుని బ్రతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. ఐ. పోలవరం మండలం లోని తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో కమిని, గురజాపులంక, అన్నంపల్లి పల్లవారిపాలెం లంకాఫ్‌ టానేలంక, అద్దంకివా రిలంక, గోగులంక, బైరవలంక, భైరవపాలెం, జి. మూల పాలెం, కన్నపులంక, కర్నిడివారిలంక, చింతపల్లి లంక తదితర లంకల్లో రైతులు తమ గొడ్డు, గోదా, ఆవు గేదెలను తీసు కుని ఏటిగట్లకు చేరుకుంటున్నారు. గట్లపైనే పశువుల్ని కట్టేసి పశుగ్రాసంకోసం నానాపాట్లు పడుతున్నారు. శనివారం గోదావరి వరద మరింత పెరిగితే కోనసీమలో చాలా లంక గ్రామాలనుండి ప్రజలను ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

వరద ప్రభావంతో కోనసీమలో మేజరు, మైనరు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. నార్త్‌ డాల్‌, సౌత్‌ అడాల్‌, తిరుమలరాజు కోడ్‌, పెరుమళ్ళరాజు కోడ్‌, అపర కౌసిక తదితర కాల్వలు వరద నీటితో తన్ని పెట్టేసేయ్‌. గుత్తెనదీవి నార్త్‌ అడాల్‌ కాలవవద్ద గోదావరిలో వరద నీరు కాలువలోకి ఎదురు పొడవకుండా ఇరిగేషన్‌ కన్జర్వెన్సీ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు, సర్వేబాదులతో పటిష్ట రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. అలాగే కేసనకుర్రుపాలెం శివారు లింగాల తూము, నల్లంగి తూములు వద్ద ఏటుగట్టుకు ఎటువంటి ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక బస్తాలు సర్వేబాదులు మట్టి వేసి బందోబస్తు చేశారు. ఐ. పోలవరం మండలంలో 41 కిలోమీటర్ల నిడిడివిగల ఏటిగట్లకు ఇరిగేషన్‌ కన్జర్వేషన్‌ అధికారులు ఈశ్వరమణ్యం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గత వరదలను దృష్టిలో పెట్టుకుని పునరావత ఘటనలు చోటు చేసుకోకుండా వరద ఉధృతిపై శాఖపరమైన చర్యలు చేపట్టారు. మురమళ్ళ రాఘవేంద్ర వారధి దిగువన గల పూరిగుడిసెలు, కొమరగిరి గట్టువారి పేట వద్ద, ఎదురులంక రామాల యంపేటవద్ద పలు కుటుంబాలు వరద తాకిడికి గురయ్యాయి. శుక్రవారం ఉదయం కొమరగిరి గ్రామ కార్యదర్శి ఎస్‌.ఎస్‌. ఫణికు మార్‌ వరద తాకిడికి గురైన కుటుంబా లను పరామర్శించి వారికి పునరావాసం ఏర్పాటు చేశారు. పాత ఇంజ రం వద్ద ఏటుగట్టుకు గత ఏడాదిపడ్డ గండిని పూడ్చేసి ప్రస్తుతం శాశ్వత పరమైన గట్టును పట్టిష్టపరిచారు. కాంక్రీట్‌ వాల్‌తో అవుట్‌ పాల్‌ స్లూయిజ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి అధికంగా వస్తున్న గోదావరి వరదలను తట్టుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే సిబ్బందికి ##హచ్చరికలు జారీ చేశారు. గోదావరి వరదల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా రెవెన్యూ, పంచాయతీ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్‌, కన్జర్వెన్సీ శాఖల అధికారులు పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement