Tuesday, May 14, 2024

AP: వరదలతో నిండా మునిగాం.. సాయం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న బాధితులు..

వి అర్ పురం, జులై 29 (ప్రభ న్యూస్) : గోదావరి గ్రామాలను చుట్టేసింది. కొన్ని గ్రామాలు ఏకంగా నీటిలో మునిగిపోయాయి. నిండా మునిగాం ఇంకా చలి ఏంటి అన్నట్లు తమ ఊర్ల వంక ఇలా ధీనంగా చూస్తున్న దృశ్యాలు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలలో తారస పడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ముంపు మండలాల దుస్థితి ఇది. చేతిలో చేద్దామన్నా.. పనిలేక పూట గడవక సరైన సౌకర్యాలు లేక ప్రభుత్వాలు పట్టించుకోక గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ ఒంక చూడక ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు వరద బాధితులు.

తమ భాధలు ఏటా వరదల్లో ఇదే తంతు అవుతున్నా తమకు ప్యాకేజీ పునరావాసం ఇవ్వకుండా ఇంకా ఇక్కడే ఉంచితే ఏమిటని భాదితులు ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తున్నారు. చుట్టూ గోదావరి, ఇళ్లన్నీ గోదాట్లో వరదకు మునిగిపోయి ముంపు వాసులు బ్రతుకు చిద్రంగా మారిందని నిర్వాసితులు ఘోషిస్తున్నారు. ఎటు వెళ్ళాలన్నా వరద దారులు లేవు. ఇదే సమయంలో గుట్టలపై ఉన్న అడవి దోమలు విలయ తాండవం చేస్తున్నాయి. బురద నీరే దిక్కు. అట్టి నీరు త్రాగితే అనేక తుగ్మతలు వస్తాయని వాపోతున్నారు.

కనీసం వరద సహాయ లాంచీలు నుండి త్రాగడానికి శుద్ధ రక్షిత నీరు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారని, కరెంటు లేక చిమ్మ చీకటిలో మగ్గుతున్నప్పటికీ కిరోసిన్ గానీ, కొవ్వెత్తులు గానీ ఇవ్వలేదు. ఇదేనా ఆపదలో ప్రభుత్వం అదుకోవాల్సిన తీరు అంటూ సర్వత్రా నిర్వాసితుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ వరద సహాయం అందని వైనం. ఇప్పటికైనా మాగోడు వినండి.. వరద తగ్గే వరకు సకల సౌకర్యాలు కల్పించాలని, నిత్యవసర కూరగాయలు, బియ్యం, కిరోసిన్ పాకలకు బారకాలు ఇవ్వాలని, వరద తగ్గే వరకు అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని పోలవరం ముంపు వరద బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement