Sunday, April 28, 2024

నిజమైన సమతామూర్తి బాబు జగ్జీవన్ రామ్ – గద్వాల్ విజయలక్ష్మి

సమానత్వమే సమాజ హితమన్న నిజమైన సమతామూర్తి బాబు జగ్జీవన్ రామ్ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను పురస్కరించుకుని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… బాబు జగ్జీవన్ రామ్ అభ్యున్నతి గల వ్యక్తి అన్నారు. వివిధ మంత్రి పదవులు పొంది 45 ఏళ్ల పాటు రాజకీయ అనుభవంతో పలు సంక్షేమ అభివృద్ధి, రాజ్యాంగ అమలులో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు. నేటితరం వారు ఆయన ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు సార్ధకత ఉంటుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement