Thursday, May 2, 2024

5089 పోస్ట్ ల భర్తీకి ‘ TRT ‘ నోటిఫికేషన్‌ విడుదల… 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ – రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TRT) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

మొత్తం పోస్టులు: 5089 ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, లాంగ్వేజ్ పండిట్‌ 611, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 164, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2575 చొప్పున పోస్టులు ఉన్నాయి

.అర్హత: బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి.వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల లోపువారై ఉండాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోరాతపరీక్ష: కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలోఅప్లికేషన్‌ ఫీజు: రూ.1000దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 20దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 21ఆన్‌లైన్‌ రాత పరీక్ష: నవంబర్‌ 20 నుంచి 30 వరకుపూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in

Advertisement

తాజా వార్తలు

Advertisement