Thursday, April 25, 2024

అధికారంపై పగటి కలలొద్దుః కాంగ్రెస్,బీజేపీలకు గుత్తా చురకలు

తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పులు కుప్పగా మార్చిందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, ప్రజల జేబుకు చిల్లు పెట్టారని విమర్శించారు. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని… ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోందా? అని ప్రశ్నించారు. పేదల కోసం ఏం చేశారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, కిషన్ రెడ్డి అబద్ధాలు చెపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమయింని విమర్శించారు. అసైన్డ్ భూములను తీసుకున్నానని ఒప్పుకున్న ఈటల రాజేందర్ ను పార్టీలోకి ఎలా తీసుకున్నారని గుత్తా ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తోడేళ్ల మాదిరి దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులకు కాంగ్రెస్ వాళ్లు కూడా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం అమలవుతోందని తెలిపారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చందాలు అడుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాదును కూడా అమ్మేస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ వార్త కూడా చదవండిః హుజురాబాద్ బరిలో కొండా.. టీ.పీసీసీ ఆలోచన ఏంటో?

Advertisement

తాజా వార్తలు

Advertisement