Friday, February 16, 2024

Tight Security – స్ట్రాంగ్ రూమ్ ల వ‌ద్ద మూడంచెల భ‌ద్ర‌త .. సిసిటివి కెమెరాల‌తో నిరంత‌ర నిఘా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. గతంతో పోల్చితే ఈసారి ప్రతి పోలింగ్‌ బూత్ దగ్గర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఓటింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో ఉంచారు. ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇక, డిసెంబర్ 3వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి నుంచి ఎన్నికల అధికారులు, పోలీసు అధికారుల వ్యూహాత్మకంగా పనిచేశారు. మొత్తం తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 70 వేలకు పైగానే పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే, ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్స్ లలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి అంచెలో పారామిలటరీ బలగాలు, రెండో స్థాయిలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో సివిల్ పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. ఇక, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భారీ భద్రత కొనసాగుతుంది. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పహారా కాస్తున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతి చేస్తున్నారు. ఇతరులకు ఎవరిని స్ట్రాంగ్ రూమ్ లలోకి పర్మిషన్ ఇవ్వడం లేదు.. ఇక, ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఒక డీసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement