Friday, October 4, 2024

AP: నేడు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కీలక సమావేశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ ఎంపీలతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది.

డిసెంబర్ 4 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే అజెండాగా సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు మధ్యాహ్నం గన్నవరం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement