Saturday, May 4, 2024

Tiger Hunt – హతవిధీ… బెబ్బులి..! మనుగడ కోసం పోరాటం.

ఆంధ్రప్రభ, ఆదిలాబాద్ బ్యూరో జనవరి 9: ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోనీ దరిగాం శివారులో మూడు రోజుల వ్యవధిలోనే రెండు పులులు గాయాలతో మృతి చెందిన సంఘటన అటవీ శాఖ లో కలకలం రేపుతోంది. మూడు రోజుల కిందట తలకు గాయాలై ఎస్.15 అని ఆడ పులి కళేబరాన్ని అధికారులు కనుగొనగా గోప్యంగా పోస్టుమార్టం చేసి రిపోర్టు రాకముందే ఇది అడవుల్లో మరో మగ పులి కుంట పక్కన మృతి చెంది ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు పులుల మధ్య ఘర్షణలో మొదటి పులి మరణించిందని అటవీ అధికారులు మీడియాకు వెల్లడించగా, రెండో మగ పులి మరణం వెనుక అనుమానాలు ఉన్నట్టు రాష్ట్ర పిసిసిఎఫ్ డోబ్రియాల్ మంగళవారం మీడియా ముందు తెలపడం వెనక పథకం ప్రకారమే పెద్దపులుల పై విష ప్రయోగం జరుగుతున్నట్టు స్పష్టం అవుతోంది.

రెండో పెద్దపులి మగజాతిగా గుర్తించిన అటవీ అధికారులు మెడకు ఉచ్చు బిగించి ఉండడం ఉన్నతాధికారుల్లో అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా ఒక్కో పులి 25 నుండి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో తన ఆవాస సామ్రాజ్యం ఏర్పరచుకొని మను గడ సాగిస్తోంది. తన పరిధిలోకి మరో మగ పులి వస్తే ఎదురు దాడికి దిగి భీకర ఘర్షణతో ఏదో ఒకటి మృతి చెందడం జరుగుతుంది. అయితే మూడు రోజుల కింద ఆడ పులి, తాజాగా మగపులి కళేబరాల వెనుక ఘర్షణ మాత్రం పడలేదని మెడకు ఉచ్చు బిగించడం దొర విష ప్రయోగంతో పులులను హతమారుస్తున్నట్టు బలమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ తడోబా, ఇంద్రావతి పులుల అభయారణ్యం నుండి ప్రాణహిత దాటి కాగజ్నగర్ అటవీ ప్రాంతానికి వలస వస్తున్నాయి. పులుల రక్షణ కోసం కేంద్రం కోట్లాది నిధులు వెచ్చిస్తున్నా స్థానిక అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరుసగా పులుల మరణాలు సంభవిస్తున్నాయి. రెండు పెద్దపులి ఎస్ 15 గా గుర్తించిన అధికారులు పంచనామా అనంతరం ఖననం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల రక్షణ చర్యల నిమిత్తం 280 మంది టైగర్ ట్రాకర్లను నియమించినా వారు మొక్కుబడిగానే విధులకు హాజరవుతున్నారు. పైగా అటవీ అధికారుల్లో నిర్లక్ష్యం కూడా పులుల మరణాలకు కారణంగా స్పష్టమవుతో oది.

జాడ లేని మరో పులి కూడా మృతి చెందిందా?
కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో తల్లిపులితోపాటు మూడు మూడు పులులు సంచరిస్తున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. చనిపోయిన రెండో పులి వెంట మరోపులి కూడా సంచరిస్తున్నట్టు వాటి కదలికలను బట్టి స్థానికులు పసిగట్టుతున్నారు. ఇదే అటవీ ప్రాంతంలో మరో పులి కూడా చనిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement