Sunday, April 21, 2024

RR: సెలబ్రిటీ రిసార్టులోని విల్లాలో చోరీ.. భారీగా నగదు, బంగారం అపహరణ

శామీర్ పేట, ఆగస్టు 2 (ప్రభ న్యూస్): శామీర్ పేటలోని సెలబ్రిటీ రిసార్టులోని ఓ విల్లలో దొంగలుపడి రూ.4-5 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకుపోయారని బాధితులు తెలిపారు. రిసార్టులోని 9 నెంబర్ విల్లాలో మహేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవల అయన న్యూజిలాండ్ లో ఉంటున్న తన కూతురి వద్దకు వెళ్ళాడు.

మహేందర్ రెడ్డి బంధువు రిసార్టులోని 9 నెంబర్ విల్లాకు వచ్చి చూడగా.. దొంగతనం జరిగిందని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. క్లూస్ టీం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. సీసీ పుటేజీలు చూస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement