Friday, May 10, 2024

రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 10గంట‌ల‌కు ప్రారంభం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఇవ్వాల ఉదయం 10గంటలకు స్టార్ట్ అవుతాయి. సాయంత్రం 4.30 గంటల దాకా ఈ భేటీ కొనసాగుతోంది. HICC వేదికగా జరుగుతున్న ఈ సమావేశాల్లో హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో ప‌లు కీలక తీర్మానాలు బీజేపీ ఆమోదించనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా, దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివచ్చారు.

ఇక‌.. తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన బీజేపీ.. కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితిపై ప్రత్యేకంగా ఓ పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగానే ప్రకటించింది. మొదటిరోజే దీనిని విడుదల చేయాలని నిర్ణయించినా సమయాభావం వల్ల రెండో రోజుకు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఓ పత్రాన్ని విడుదల చేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించామని, కార్యవర్గంలో చర్చించిన తర్వాత విడుదల చేస్తామని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement