Sunday, April 28, 2024

MDK: పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డే పార్టీ కాంగ్రెస్…నీలం మ‌ధు

మెద‌క్: కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పేదల పక్షాన నిలబడుతుందని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. నీలం మధు మంగళవారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం పిఎన్ఆర్ టౌన్ షిప్ కాలనీవాసులను కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎంపీ అభ్యర్థి మధును సన్మానించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ…. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. పేదల పక్షాన నిలబడిన కాంగ్రెస్ పార్టీ వారి అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు.

రానున్న రోజుల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, కాలనీవాసులు శ్రీకాంత్, జగదీష్, నాగేశ్వర్, భోజరాజు, సత్తయ్య, గోపి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అంజన్నను దర్శించుకున్న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు..
మెదక్ జిల్లాలో విశిష్టత గాంచిన చాకరిమెట్లలోని ఆంజ‌నేయ‌ స్వామి వారిని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మంగళవారం దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చాకరిమెట్లలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామివారిని మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డిలతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నీలం మధుతో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. జెడ్పీటీసీ సుహాసిని, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మీపతిరావు, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు..
ఎంపీ అభ్యర్థి మధు ను సన్మానించిన ట్రస్ట్
శివంపేటలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మధు ను ట్రస్టు సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, గుర్రాల మల్లేష్, ఉదయ్ కుమార్, శివకుమార్, నాగులూరి మల్లేష్, వెంకట్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వరశర్మ, శివకుమార్ గౌడ్, పురుషోత్తం శర్మ, పద్మ మహేష్, మారుమూల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement