Friday, October 4, 2024

TS : లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజ‌రు…30 మంది అధికారుల‌పై క్రిమినల్ కేసులు

లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు కమిషనర్ తెలిపారు.
సైఫాబాద్​లో 40 మందిపై..
ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 40 ఉద్యోగులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. వారిపై అడిషనల్ కమిషనర్ మంగతాయారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement