Wednesday, May 1, 2024

Big story | ఉప్పొంగిన గోదావరి.. పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకూ జలకల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీరాం సాగర్‌, కడెం, నిజాంసాగర్‌ ప్రాజెక్టులతో పాటు అనేక ప్రాజెక్టుల్లోకి భారీగా నీరుచేరి ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నిండుకుండలా మారాయి. మరోవైపు రాష్ట్రంలో మరిన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ఉద్ధృతితో గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల్లోకి అంచనాకు మించి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థం 90.31 టీఎంసీలు కాగా.. మంగళవారం సాయంత్రానికి 63.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,084 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు తాజాగా ఇన్‌.

- Advertisement -


ప్లnో 26,296 క్యూసెక్కులు నీరు రాగా.. 882 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 5,300 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1400 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థం 17.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 11.91 టీఎంసీలుగా నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతానికి 21.48 టీఎంసీలకు చేరుకుంది.

ఇక ప్రస్తుతం 5.99 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా.. 385 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. మంగళవారం సాయంత్రానికి 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నట్లు వివరించారు. అదేవిధంగా మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో 27.50 టీ-ఎంసీల నీటి సామర్థం ఉండగా ప్రస్తుతం 15.72 టీ-ఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

జంట జలాశయాలకు వచ్చిన చేరుతున్న భారీ వరద

హైదరాబాద్‌ నగర శివారులోని జంట జలాశయాలు నీటికుండలా మారి జలకళను సంతరించుకుంది. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాలకు భారీస్థాయిలో వరద నీరు పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌ జలాశయానికి 2000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో 4 గేట్లు ఎత్తి.. మూసీ నదిలోకి 2750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1761.75 అడుగులకు చేరింది. ఇంకా ఉస్మాన్‌సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం వస్తోంది. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 1786.10 అడుగులకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement