Tuesday, April 30, 2024

NZB: ఇందూరులో వికసించిన కమలం.. బీజేపీకి పట్టం కట్టిన ప్రజలు..

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 3 (ప్రభ న్యూస్): ఎంతో ఘన చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన ఇందూరులో కమలం వికసించింది. ఇందూరు గడ్డపై కాషాయం జెండా ఎగిరింది. ఎన్నికల త్రిముఖ పోరులో ఇందూరు ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో అన్ని రౌండ్లలో.. ఉత్కంఠ పోరులో మొదటి నుండి ఆధిక్యత ప్రదర్శించిన ధనపాల్ సూర్యనారాయణ 7వ రౌండ్ వచ్చే సరికి కొంత వెనుకబడ్డారు. తర్వాత వచ్చిన రౌండ్లలో అనూహ్యంగా ఆధిక్యత పెరిగింది. గత 10సంవత్సరాల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గణేష్ గుప్తా, మంత్రులుగా పనిచేసి 44 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీలు గట్టి పోటి ఇచ్చినా బీజేపీ అభ్యర్థిని బీట్ చేయలేక పోయారు.

ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటి జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ బిగాలకు 44,598 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ధనాపాల్ సూర్య నారాయణకు 73,724 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి 59,104 ఓట్లు పోల య్యాయి. 21 రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి షబ్బీర్ అలీపై 14,620 ఓట్లతో విజయం సాధించారు. కనీవినీ ఎరుగని రీతిలో 14వేల 620 అత్యధిక మెజారిటీతో దన్ పాల్ సూర్యనారాయణకు పట్టం కట్టారు. ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధన్ పాల్ సూర్య నారాయణకు నిజామాబాద్ అర్బన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అర్బన్ గెలుపుతో బీజేపీ శ్రేణులు, అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement