Tuesday, April 30, 2024

Fighter – బ‌ర్రెల‌క్క‌కు నిరాశ‌…. కొల్లాపూర్ లో డిపాజిట్ గ‌ల్లంతు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలిచారు. బర్రెలక్కతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ ఓటమి చవిచూశారు. అయితే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువగా బర్రెలక్క పాపులారీటీ సాధించినా ఓడిపోయింది. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనక్కి పడిపోయారు.

విజిల్‌ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన బర్రెలక్కకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు వచ్చాయి.. రెండో రౌండ్‌లో 262 ఓట్లు పోలైయ్యాయి. బర్రెలక్కకు మొత్తం 4 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇక్క‌డ డిపాజిట్ గ‌ల్లంత‌య్యింది.. కొల్లాపూర్ నియోజకవర్గంలో హేమా హేమీలు బరిలో ఉన్న చోట బర్రెలక్క ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. శిరీషి ఓడిపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement