Sunday, April 28, 2024

TS : సొంతిల్లు లేని పేదల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం… మంత్రి తలసాని

సొంత ఇల్లు లేని పేదల కల నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆన్ లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ లు అనుదీప్ దురిశెట్టి, అమయ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… సెప్టెంబర్ 2న కుత్బుల్లాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని మున్సిపల్ మంత్రి KTR ప్రారంభించనున్నారన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే దేశంలోనే మొదటిసారి ఆన్ లైన్ డ్రా పద్దతి పెట్టినట్లు తెలిపారు.

NIC రూపొందించిన Randomisation Software ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో నుండి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో 12వేల మందికి ఇండ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్ధిక సహాయంతో ఇండ్లను నిర్మించాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement