Sunday, April 28, 2024

ఫ్యూచర్‌ అంతా ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌దే.. ప్రతి 25 కి.మీ ఒక విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భవిష్యత్‌ అంతా విద్యుత్‌ వాహనాలదేనని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. వాహనాలు ఉపయోగించే ప్రతి ఒక్కరు విద్యుత్‌ వాహనాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. టీఎస్‌ రెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్‌ వాహనాల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. 10 వేల విద్యుత్‌ మోటార్‌ సైకిళ్లు అందుబాటులోకి వినియోగంలోకి వచ్చినట్లయితే ఏడాదికి రూ.250 కోట్ల పెట్రో దిగుమతులను ఆదా చేసినవారిమవుతామని జగదీశ్‌రెడ్డి వివరించారు.

ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం చాలెంజ్‌గా మారిందని, ఈ నేపథ్యంలో విద్యుత్‌ వాహనాల వాడకం తప్పనిసరైందన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు ఆ వాహనాలు తయారీ చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్‌ వాహనాల అమ్మకాలను మాత్రమే కాకుండా ఇక్కడ తయారీ చేస్తున్న పారిశ్రామిక రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అంతేకాకుండా విద్యుత్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీ పరిశ్రమలను తెలంగాణలో నెలకొల్పే విధంగా ప్రభుత్వం తగిన రాయితీలు ఇస్తుందన్నారు.

వాహనాల చార్జింగ్‌కు ఎలాంటి సందేహాలు వద్దని, ఇప్పటికే 138 ఛార్జింగ్‌ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో మరో 600 చార్జింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 24గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా ఉన్నందున విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ విషయంలో ఎవరు భయపడొద్దన్నారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ కాలుష్యం మానవ జాతి మనుగడకే చాలెంజ్‌గా మారిందని, ఆ చాలెంజ్‌ను ఎదుర్కోవడానికి విద్యుత్‌ వాహనాల వాడకం తప్పనిసరైందన్నారు. పొగ మంచుతో పాటు పర్యావరణ కాలుష్యం విడుదల చేస్తున్న పొగతో దేశ రాజధాని ఢిల్లిdతో పాటు బీజింగ్‌ వంటి ప్రాంతాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement