Sunday, April 14, 2024

TS: అర్థ‌రాత్రి దొంగ‌ల భీభ‌త్సం… ఏటీఏం నుంచి 30ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌…

అర్థ‌రాత్రి ఏటీఎంలోని భారీ నగదు దొంగించబడింది. భారీ మొత్తంలోనగదు అపహరణకు గురికావడం సంచ‌ల‌నంగా మారింది. ఏకంగా ఎస్​బీఐ ఏటీఎం మిష‌న్‌ను ధ్వంసం చేసి 30ల‌క్ష‌ల‌ను దొంగలు అప‌హ‌రించుకుపోయారు. ఈ ఘ‌ట‌న బ‌య్యారంలో చోటుచేసుకుంది.

కాగా, శ‌నివారం సాయంత్రం ఆ ఏటీఎంలో డబ్బులు పెట్టారు. రాత్రి ఏటీఎంలోకి చొరబడిన దొంగలు మిషన్ ను ధ్వంసం చేసి దాదాపు 30 లక్షల నగదు తీసుకెళ్లారు. బయ్యారం ఇల్లందు మెయిన్ రోడ్ లో ఒక ప్రైవేటు ఇంట్లో ఏటీఎం నిర్వహించడం దానిలో సీసీ కెమెరా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇది కావాలని ఎవరైనా చేశారా.. లేక దొంగల పనేనా..ఇంటి దొంగల పనేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. స్థానికులు తమ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement