Friday, May 3, 2024

TS: గాంజా శంకర్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో షాక్​… సినిమా యూనిట్​కు నోటీసులు…

మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న గాంజా శంక‌ర్ సినిమాకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో షాక్‌నిచ్చింది. ఆ సినిమా పేరులోని గాంజా అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని తెలిపింది. ఈ మేర‌కు ఆ చిత్ర యూనిట్‌కు నోటీసులు పంపించింది.

సినిమాలో డ్రగ్స్కు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు కనుక ఉంటే ఎన్డీపీఎస్- 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. గాంజా శంకర్ అనే పేరు విద్యార్థులు, యువతపై ప్రభావం చూపిస్తుందని, కాబట్టి దానిని తొలగించాలని సూచించారు. గంజాయికి సంబంధించిన సీన్స్, డైలాగులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement