Tuesday, April 30, 2024

TS: సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో టెన్ష‌న్.. విద్యార్ధి సంఘాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

బ్లేడ్ ల‌తో దాడి.. ప‌లువురికి గాయాలు
క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్స్ కు త‌ర‌లింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు పాటలు పాడుతుంటే అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు ఫైజల్ పై ఏబీవీపీ విద్యార్థులు దాడికి దిగారని ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి.. ఈ సంఘటనకు సంబంధించి ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగగా.. ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు బ్లేడ్ తో భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

దీనిపై కొందరు విద్యార్థులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో హుటాహుటిన యూనివర్సిటీకి చేరుకుని గాయపడిన విద్యార్థులను చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు సర్ది చెప్పారు.. కేసుల‌తో జీవితాలు నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని హితవు ప‌లికారు.. ఇక‌పై దాడులు చేసుకోబోమ‌ని కోరుతూ పోలీసులు హామీ తీసుకున్నారు. ఇక గాయపడిన విద్యార్థుల్లో విద్యార్థినులు కూడా ఉండటం గమనార్హం. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement