Monday, April 29, 2024

కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడండిః కేఆర్ఎంబీకి తెలంగాణ విజ్ఞప్తి

 

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ శనివారం మరో లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రమేనని స్పష్టం చేసింది. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా నది నుంచి బేసిన్ ఆవలకు నీటి మళ్లింపును ట్రిబ్యునల్‌ అనుమతించలేదని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖలో పేర్కొన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు నుంచి బేసిన్‌ ఆవలికి నీటి తరలింపుతో బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయన్నారు. నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని.. 700 కిలోమీటర్ల దూరంలో నీటిని తరలించడం అన్యాయమని తెలిపారు.

బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తుంగభద్ర హై లెవెల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ ఆవలికి మళ్లీస్తాయని.. కాబట్టి కేటాయింపులు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్‌ఎన్‌ ప్రాజెక్టు ద్వారా టీబీహెచ్‌సీఎల్‌ ప్రాజెక్టు కంటే ఆవలకు తీసుకుని వెళ్లడం ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమన్నారు. మిగులజలాలపై బేసిన్ ఆవలకు తీసుకెళ్లే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉంటే.. ఇప్పుడు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టును 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమని కేఆర్​ఎంబీకి రాసిన లేఖలో ఈఎన్​సీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండిః తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం: సబిత

Advertisement

తాజా వార్తలు

Advertisement