Monday, April 29, 2024

Nizamabad: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.. స్పీకర్ పోచారం

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం దోమలెడ్గి గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తల్లిని మించిన దైవం లేదన్నారు. గర్భిణీలు, బాలింతల కోసం సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. గర్భిణీలు సంపూర్ణమైన ఆహారం తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు 11వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. గృహలక్ష్మి పథకం త్వరలోనే అమలు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు. గతంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావాలంటే ఎంతో శ్రమించాల్సి వచ్చేదన్నారు. స్వరాష్ట్రంలో అలాంటి సమస్య లేకుండా సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement