Friday, April 26, 2024

క‌రోనా క‌ట్ట‌డిలో దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ – కేంద్రం ప్ర‌శంస‌

హైదరాబాద్‌, : కరోనా వైరస్‌ కట్టడిలోనూ, కోవిడ్‌ చికిత్సలకు వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ దేశంలో మెరుగైన ఏకైక రాషట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు కోవిడ్‌ చికిత్సలు, వైద్య సదుపాయాల అంశాల వారీగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కొన్ని ప్రమాణాలను రూపొందించింది. రాష్ట్రాలను మెరుగైన, మోస్తారు, తక్కువ, అతి తక్కువ శ్రేణులుగా వర్గీకరించింది. ఇందులో మెరుగైన స్థానంలో కోవిడ్‌ చికిత్సలోనూ, వైద్య సదుపాయాల కల్పనలోనూ మెరుగైన స్థానంలో తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రం ఉంది. ఇక హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండెక్స్‌ లో మోస్తారు (యావరేజ్‌) స్థానంలో రాజస్తాన్‌, హర్యానా నిలిచాయి. కోవిడ్‌ కట్టడిలో యావరేజ్‌గా పంజాబ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ ఉండగా… గుజరాత్‌, జమ్మూ కశ్మీర్‌ తక్కువ స్థితిలో, అతి తక్కువ స్థితిలో మద్యప్రదేశ్‌ , బిహార్‌ రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా కట్టడిలో ఓడిశా, ఝార్ఖండ్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement