Friday, May 3, 2024

లాక్ డౌన్ లోను మద్యం అమ్మకాలు..? జీవో తెచ్చే యోచనలో సర్కార్

తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధించింది సర్కార్. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. అయితే మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కార్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాల పై వివరాల్ని తెప్పించిన సీఎం… వాటితో పోల్చుకుని తెలంగాణలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కొత్త జీవో తెచ్చి మద్యం అమ్మకాలను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక లో ఉ.6 నుండి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు…ఏపి లో ఉ.6 నుండి 12 గంటల వరకు వైన్, బార్ షాపులు ఓపెన్….చత్తిస్ గడ్, మహారాష్ట్ర లో సా.6 గంటల వరకు హోం డెలివరీ…

Advertisement

తాజా వార్తలు

Advertisement