Sunday, April 28, 2024

Telangana – వాడివేడిగా జీహేచ్‌ఎంసీ బడ్జెట్ సమావేశాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నేడు వాడివేడిగా సాగింది..కార్పొరేటర్లు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ డివిజన్లలోని సమస్యలను తీర్చలంటూ. మేయర్‌ విజయలక్ష్మిని కోరారు. కార్యాలయాల్లో కూర్చోవడమే కాకుండా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాలని బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు అధికారులకు తెలిపారు. అధికారుల పనితీరును ప్రశ్నిస్తు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కూడా బీజేపీ, ఎంఐఎంకు మద్దతు ఇచ్చారు. వీధిల్లో ఏర్పటు చేసే టైట్లకు వారు చేస్తున్న నిర్లక్ష్యన్ని తప్పుబట్టారు.

మేయర్‌ విజయలక్ష్మి కూడా అధికారులపై మండిపడ్డారు. సమాచారం లేకుండా జోనల్‌ స్థాయిలో అధికారులు నిర్మహిస్తున్న సమావేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా కార్పొరేటర్ శ్రావణ్ డిమాండ్ చేశారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పాలకమండలి తీర్మానం చేసింది. ఈ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. ప్రకటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషనర్‌కు మేయర్‌ ఆదేశంచారు. విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జీహేచ్‌ఎంసీ బడ్జెట్ సమావేశాలు రేవటికి వాయిదా పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement