Friday, May 17, 2024

IPL | కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ లో ఓ ప్లేయర్‌‌కి రీప్లేస్‌మెంట్ !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తరుఫున ఆడనున్న ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ గ‌స్ అట్కిన్సన్ గాయ‌ప‌డాడ్డు. దీంతో అత‌డు ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు అందుబాటులో ఉండ‌డం అనుమానంగా మారింది. ఈ క్ర‌మంలో కేకేఆర్ అత‌డి స్థానంలో శ్రీలంక పేస‌ర్ దుష్మంత చమీరాను తీసుకుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

కాగా.. శ్రీలంక పేస‌ర్ దుష్మంత చమీరాను గ‌తంలో 2018, 2021, 2022 సీజ‌న్లో ఆడాడు. 2018లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున, 2021లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు, 2022లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌రుపున ఐపీఎల్ లో ఆడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement