Wednesday, May 22, 2024

TS | అల్లోల హన్మంతు రెడ్డి మృతి.. సంతాపం తెలిపిన‌ కేసీఆర్

నిర్మల్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు అల్లోల హన్మంతు రెడ్డి మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి వారు పరామర్శించారు. హన్మంతు రెడ్డి ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ ఎస్ నేతలు.. హన్మంతు రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement