హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పూలతో పూర్తిగా ఉత్సవ వాతావరణం కలిగేలా అలంకరించారు.ఇప్పటికే, తెల్లటి ధవళ కాంతితో వెలిగి పోతున్న సచివాలయ భవనం ఈ సరికొత్త అలంకరణలతో మరింత ఆకర్షణీయంగా మారింది. కాగా, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరిశీలించారు
- Advertisement -

