Thursday, October 10, 2024

RAJANNA SIRICILLA – తొమ్మిదేళ్ల‌లోనే అద్భుత ప్ర‌గ‌తి – కెటిఆర్

రాజ‌న్న సిరిసిల్లా – తొమ్మిదేళ్ల అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కే తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు

అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలంగాణ , జగిత్యాల లో అమలవుతున్న అభివృధి, సంక్షేమ కార్యక్రమా ల ప్రగతిని వివరించారు. ప్రజా భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల అధికారుల సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపామని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement