Sunday, April 21, 2024

Khammam: అమరవీరులకు మంత్రి పువ్వాడ ఘన నివాళి

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కాలనీ లోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఆనంతరం ఖమ్మం ఎన్ టి ఆర్ సర్కిల్ లో తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడి నుండి మయూరి సెంటర్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్దకు వెళ్లి పుష్పగుచ్చం ఉంచి తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమరులకు అంజలి ఘటించారు. వారి సేవలను స్మరించుకున్నారు

. ఆనంతరం ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. దశాబ్ది ఉత్సవాల ను ప్రారంభించారు. ఈ కార్య క్రమాల్లో జిల్లా కలెక్టర్ గౌతమ్, విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, ఏమ్మెల్సి తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement