Saturday, March 2, 2024

Karimnagar – తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు మంత్రి గంగుల నివాళి..

క‌రీంన‌గర్ – తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బాగంగా శుక్రవారం కరీంనగర్ లో తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద తెలంగాణ అమర వీరులకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నివాళులు అర్పించారు. తెలంగాణ అమరుల త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాని, బి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్ట పల్లిలో గల ఉత్తర తెలంగాణ భవన్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement