Saturday, April 13, 2024

Revanth Reddy: మాజీసీఎంను ప‌రామ‌ర్శించ‌నున్న సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ను ఆయన పరామర్శించనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంత్రులు కేసీఆర్​ను పరామర్శించనున్నారు.

సీఎం కేసీఆర్​ను పరామర్శించేందుకు రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితుల‌ను వైద్యుల‌తో మాట్లాడి తెలుసుకున్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు ఆరా తీశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం తానే స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement