Sunday, April 28, 2024

Telangana – మరి కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ సెషన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగాయి.

ఈ నేపథ్యంలో బడ్జెట్ సెషన్స్ మరింత ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీ చర్చపైనే పడింది. అందులోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విమర్శలు గుప్పిస్తునే దూకుడుగానే ముందుకు కొనసాగుతుంది. బీఆర్ఎస్ పై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ప్రతిపక్ష నేతల కౌంటర్లకు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement