Friday, May 17, 2024

గిరిజనులకు తీజ్ సాంప్రదాయ పండుగ – ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

తుర్కయంజాల్( ప్రభ న్యూస్) గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా నిర్వహిస్తారని ప్రపంచంలోను ఆనాటి నుండి సాంప్రదాయాలను ప్రతిరూపమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపుర్ లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఘనంగా తీజ్ పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలోనూ తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ,ప్రతి సంవత్సరం తొమ్మిదిరోజులపాటు తీజ్‌ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.

. ఇంజాపుర్ లో ఉన్న 25 కాలనీ లో ఉన్న బంజారా ప్రజలు పెద్దఎత్తున తమ సాంప్రదాయ ఆట-పాటలతో పెద్దలు,మహిళలు-యువతిలు తీజ్ బుట్టలతో ఇంజాపుర్ నుండి యంజాల్ మాసబ్ చెరువు వరకు భారీ ర్యాలీగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం లో దేవరకొండ మాజీ.ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్, ఫ్లోర్లీడర్ కళ్యాణ్ నాయక్,డీసీసీబీ వైస్ చైర్మన్ కోతకుర్మ సత్తయ్య, కౌన్సిలర్లు శ్రీలత గౌతం,బొక్కరవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు నోముల కృష్ణ గౌడ్,గోపాల్ రెడ్డి,గిరిజన మోర్చ అధ్యక్షుడు శ్రీనవాస్ నాయక్, మాజీ వార్డ్ నెంబర్ రమేష్ నాయక్,అధ్యక్షుడు కిషన్ సింగ్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,రామలింగం,రాజ్ కుమార్,జేత్యా,మకట్లాల్, బద్య నాయక్,రమేష్,మోహన్, భాస్కర్, రాజు,సభ్యులు,ప్రజలు భారీ ఎత్తున తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement