Friday, April 26, 2024

నేడే టిడిపి ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ – హాజ‌రుకానున్న చంద్ర‌బాబు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సుప్రసిద్ధ సినీ నటుడు ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భం గా దేశవ్యాప్తంగా 100 సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. పార్టీ ఆవిర్భవించి 41 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో నేడు హైద‌రాబాద్ లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ టిడిపి తెలంగాణ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నుంది.. ఈ స‌భ‌పై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఎన్టీఆర్‌కు నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రజాసమస్యలపై తెలంగాణలో ఉద్యమ కార్యా చరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇంటిం టికి తెలుగుదేశం కార్యక్రమం అమలును పొలిట్‌బ్యూరో ప్రశంసించడంతో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

ప‌ద‌వుల‌లో40 శాతం యువ‌త‌కు ప్రాధాన్యం…
కాగా ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని ప్రజాసమస్యలు, ఉద్య మాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ కష్టాలపై సుధీర్ఘంగా చర్చించి ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నా యుడు మీడియాతో మాట్లాడుతూ పొలిట్‌ బ్యూరో నిర్ణయా లను వెల్లడించారు. నేటి తరానికి ప్రజాసంక్షేమా నికి తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని తెలిపే విధంగా కార్యక్రమాలు రూపొందించా లని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి జీవో-1ని రద్దు చేయాలని పోలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. ఏపీలో రాక్షసపాలన అంతం కోసం నిరంతర ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రలో అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పొలిట్‌ బ్యూరో తీర్మానిం చింది. పార్టీలో యువతకు 40శాతం అవకాశాలు కల్పించా లని పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ బలోపేతానికి ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమా లు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని పార్టీని పొలిట్‌ బ్యూరో ఆదేశించింది. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భం గా 100రూపాయల నాణంపై ఎన్టీఆర్‌ను ముద్రించినందుకు ప్రధాని మోడీకి టీడీపీ పొలిట్‌ బ్యూరో ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. ఈ మేర‌కు చంద్ర‌బాబు ప్ర‌ధాని మోడీకి ఒక లేఖ రాశారు.

ట‌చ్ లో 40 మంది వైసిపి ఎమ్మెల్యేలు ..
ఏపీలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాక్షసంగా పాలిస్తున్నారని నిందించారు. జగన్‌ పాలనపై విరక్తి చెందిన 40 మంది వైసీపీ శాసనసభ్యులు టీడీపీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి వైసీపీ పార్టీ శూన్యం ఆవరిస్తుందని చెప్పారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ బాబు యువగళం యాత్రను అడ్డుకోవడానికి సీఎం జగన్మోహన్‌ రెడ్డి జీవో నం.1ని తీసుకువచ్చారని ఆరోపించా రు. తప్పు ఒప్పుకుని జీవో నం-1ని రద్దుచేయని పక్షంలో ప్రజలు గుణపాఠం నేర్పుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అలాగే పొలిట్‌ బ్యూరో సమావేశంలో 17 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుల అంశంపై పొలిట్‌ బ్యూరోలో చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వాతావరణంలోనే పొత్తుల అంశం తెరమీదకు వస్తుందని తెలిపారు.

మేలో రాజమహేంద్రవరంలో మహానాడు
ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును రాజమహేంద్ర వరంలో నిర్వహిం చేందుకు పొలిట్‌ బ్యూరో నిర్ణయించిందని, నిర్వహణకు సం బంధించి ప్రత్యేక కమిటీలు వేయనున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ఎన్నికల కోసం మ్యానిఫెస్టో రూపొందించేందుకు కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించారు. తెెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంటనష్టం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement