Friday, May 17, 2024

క‌ర్నాట‌క ఫ‌లితాల‌పై తెలంగాణ పార్టీల‌లో ఉత్కంఠ‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై అన్ని రాజకీయ పార్టీలో ఆసక్తి నెలకొంది. ఆ రాష్ట్రంలో హోరా హోరీగా సాగిన పోరులో.. కన్నడిగులు ఎవరికి పట్టం కడతారో శనివారం తేలిపోనుంది. తెలం గాణలో మాత్రం ఉత్కంఠను రేపుతున్నాయి. కన్నడ నాట ఫలితాల ప్రభావం మాత్రం తెలంగాణపై ప్రధా నగా చూపనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కర్ణాట కలో మాత్రమే అధికారంలోకి ఉన్నది. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు కర్ణాటక ఫలితాలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. గత కొంత కాల ంగా నిలిచిపోయిన చేరికల అంశం.. మే 13 తర్వాత తిరిగిం పుంజుకుంటాయని, కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇక్కడ ఆ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుందనే చర్చ నడస్తోంది.

అయితే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా కన్నడ ఫలితంపై ఆసక్తిగా చూస్తున్నారు. కర్ణాటక ఎన్నికలను కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ప్రతిష్టాత్మ కంగా తీసుకుని.. అధికారంలోకి వచ్చేందుకు అన్ని శక్తియుక్తులను కూడగట్టుకుని ముందుకు సాగింది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే.. తెలంగాణలోనూ ఆ ప్రభావం ఉంటుందని, ఇక్కడ అధికారంలోకి రావడా నికి మరింత శక్తి వస్తుందనే అభిప్రాయంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. సర్వే సంస్థల ఫలితాలు కూడా హస్తం పార్టీ వైపే చూపిస్తున్నాయని, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించుబోతుందన్న అంచనాలు వేస్తున్నాయి. సర్వే ఫలితాలే నిజమైతే.. ఇతర పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతారని కాం గ్రెస్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు ఆ ఫలితాలు దోహదపడ తాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్‌ పార్టీకి క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్‌ బలంగా ఉండటమే కాకుండా పార్టీ కార్యక్రమాలతో నిత్యం ప్ర జలతో మమేకమయ్యే విధంగా కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాంగా తామే ఉంటామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కొంత మేరకు బలం ఉన్నప్పటికీ .. గ్రామీణ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపేంత స్థాయికి చేరలేదని కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అగ్రనేతలతో డిక్లరేషన్లు ప్రకటించేలా ప్లాన్‌..
రైతు డిక్లరేషన్‌ రాహుల్‌గాంధీ, యువ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళా డిక్లరేషన్‌ను సోనియాగాంధీతో , ఎస్సీ డిక్లరేషన్‌ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌, ఓబీసీ డిక్లరేషన్‌ వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లను పార్టీలోని ఆయా వర్గాల్లోని అగ్రనాయకులతో ప్రకటించడం వల్ల ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారు. సెప్టెంబర్‌ 17వ తేదీని ఎన్నికల మేనిఫెస్టోనూ ప్రకటించి పూర్తిగా ఎన్నికల బరిలోకి వెళ్లాలనే యోచనలో కాంగ్రెస్‌ నేతలున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిత్వాలపైన కూడా ముందుగానే క్లారిటీ ఇచ్చే విధంగా చూస్తున్నామని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన్నట్లు పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement