Sunday, December 8, 2024

TS: ఆ 106మందిని వెంట‌నే విధుల్లోకి తీసుకోండి.. హైకోర్టు

హైదరాబాద్ : ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే అభియోగాలతో సిద్దిపేటకు చెందిన 106 మంది ఐకేపీ, డీఆర్డీఏ ఉద్యోగులు సస్పెన్షన్ కు గురి కాగా వారికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈసీ విధించిన సస్పెన్షన్ ను ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేయగా.. అందరినీ తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారనే అభియోగాలతో ఈసీ ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్ ఒకే రోజు 106 మందిపై సస్పెన్షన్ వేటు వేయగా.. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement