Tuesday, April 30, 2024

వేసవి ఎఫెక్ట్… కిటకిటలాడుతున్న మెట్రో

వేసవి ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణీకులు ఎండదెబ్బకు భయపడుతున్నారు. దీంతో వేసవి ఎఫెక్ట్ కారణంగా డ్యూటీలకు వెళ్లే వారు మెట్రో బాట పడ్డారు. ఎండల కారణంగా హైదరాబాద్ మెట్రోకి అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఎండలు ఎక్కువగా ఉండడంతో బస్సుల్లో వెళ్తే ఎండ వడదెబ్బ తగులుతుందేమోననే భయంతో ప్రయాణీకులు మెట్రో బాట పడుతున్నారు. మెట్రోలో ఏసీ ఉండడంతో ప్రయాణించినంత సేపు కూల్ గా వెళ్లొచ్చనే ఉద్దేశంతో ప్రయాణీకులు మెట్రో రైళ్ల పై వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఏ మెట్రో స్టేషన్ చూసినా కిటకిటలాడుతున్నాయి. అమీర్ పేట జంక్షన్ లో అయితే ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. జపాన్, ముంబై మెట్రో తరహాలో హైదరాబాద్ రష్ పెరుగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement