Tuesday, May 21, 2024

యల్లనూరులో చైన్ స్నాచింగ్

యల్లనూరు ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్) : స్థానిక మండల కేంద్రంలో గురువారం చైన్ స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు మండల కేంద్రానికి చెందిన నారాయణమ్మ అనే మ‌హిళ‌ మండల కేంద్రం నుండి పెట్రోల్ బంకు వరకు ఉదయం వాకింగ్ కు వెళ్లింది. పెట్రోల్ బంకు సమీపంలో ద్విచక్ర వాహనం పై హెల్మెట్ ధరించి ఓ దుండగుడు ఆమె మెడలో ఉన్న మూడు తులాల‌ బంగారు గొలుసు లాక్కొని పరారయ్యడు. వెంటనే బాధిత మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement