Tuesday, April 30, 2024

Strong Counter – మోడీవి గాలి మాట‌లు…కాంగ్రెస్ వి ప‌చ్చి అబ‌ద్దాల హామీలు – కెటిఆర్

నిర్మ‌ల్ – గాలి మోటర్ లో వ‌చ్చి గాలి మాట‌లు మాట్లాడి మోడీ వెళితే…. కాంగ్రెస్ ప‌చ్చి అబద్దాల హామీల‌తో మోసం చేస్తున్నారంటూ మండి ప‌డ్డారు భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు . కాంగ్రెస్ వాళ్ళకీ ఒక్కసారి కాదు 11 సార్లు 55 ఎoడ్లు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి హయాంలో త్రాగు సాగు నీరు అందలేదని అన్నారు.కేసీఅర్ పాలనలో ఒక్క సంవత్సరం కరువు కాటకాలు లేవని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్య శ్యామలంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించామన్నారు. నిర్మల్ జిల్లా లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే చనాఖ కొరాట, సదర్మాట్ పూర్తి అవుతాయని అన్నారు. అభివృధ్ది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసీ నేర్చుకోవాలని తెలిపారు. నీళ్ళు ఇయ్యక పొతే ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న సిఎం కేసీఆర్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 లునిస్తే ఇప్పుడు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. 70 లక్షల ఖాతాల్లో రైతు బందు వేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. .. నిర్మ‌ల్ జిల్లాలోని పాక్ పట్లలో రూ.300 కోట్ల‌తో నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్ ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ళ కోసం రైతులు తన్నుకునే వారు కానీ, నేడు అలాంటి ప‌రిస్థితులు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని త‌లిపారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ పంటలు కొనుగోలు చేసినా చేయకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఆయిల్ ఫామ్ పరిశ్రమ వృద్ధితో ప్రతి ఒక్కరికి త‌క్కువ ఖ‌ర్చుతోనే మంచి నూనె అందే అవకాశం ఉందని తెలిపారు. తన నియోజకవర్గమైన సిరిసిల్ల రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే తనదే బాధ్యత అని మంత్రి స్ప‌ష్టం చేశారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో పండించే ఆయిల్ ఫామ్ పంటను ఇక్కడే కొనుగోలు చేస్తార‌ని చెప్పారు.

ప్రతి రైతు సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ సాగు అనీ, రైతుల అయిల్ ఫామ్ సాగు ప్ర‌భుత్వం రాయితీలు సైతం ఇస్తున్న‌ద‌ని చెప్పారు. రివర్స్ పంపుతో ఎస్సా ఎస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తూ.. ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని మంత్రి కేటీఆర్ ప్ర‌జ‌ల‌ను కోరారు.

- Advertisement -

ఇక మోడీపై విమ‌ర్శ‌ల దాడిని పెంచారు కెటిఆర్ . 50 ఏళ్లలో చేయలేని పని 10 ఏళ్లలో అయిందని మోడీ మీద మాట్లాడుతున్నారు..గాలి మోటారు మిద వచ్చి మోడీగాలి మాటలు మాట్లాడి వెళ్లారని మండిపడ్డారు. తాము ఢిల్లీ గులాం లం కాదు. ఎవ్వరు బీటీం కాదని తెలిపారు. సిలిండర్ ధర 12 వందలు చేసి ఇక్కడ చెప్పితే ఎట్లా? అన్నారు. మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు ఎవ్వరికి దేవుడో చెప్పడం లేదని ప్రశ్నించారు.

పిచ్చోల్లకు ఓట్లు వేద్దామా? 15 లక్షలు ఏవి అని నిలదీయండని తెలిపారు. 15 లక్షలు వచ్చిన వాళ్ళు బిజేపి నాయకుల కు ఓట్లు వేయండి.. రైతు బంధు వచ్చిన వాళ్లలు మాకు ఓటు వేయండని అన్నారు. ఒక్కటె రైలు కు అన్ని చోట్ల జెండాలు ఉపుతాండ్లంటు మాట్లాడారు. నేను సిఎమ్ కావాలంటే మోది ఎన్ ఓ సీ అవసరం లేదని కేటీఆర్ మండిపడ్డారు. హిందూ ముస్లిం అని మత పిచ్చి లేపుడే వాళ్ల పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లకి 11 ఏళ్లు అవకాశం ఇచ్చాం ఇంకా ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ సచ్చిన పాము.. ఆరు గ్యారంటీ లు అని సఛ్చి వాళ్ళని లేపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement