Sunday, May 5, 2024

శ్రావణి కి పీ హెచ్ డీ

నిజామాబాద్ జూలై (ప్రభ న్యూస్)13b-: హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు మరియు జనాభా పై పరిశోధన చేసి డి. శ్రావణి డాక్టర్ రేట్ సాధించింది.ఆసఫ్ జాహిల కాలంలో హైదరాబాద్ రాష్ట్రం లో వ్యవసాయ పరిస్థితులు, జనాభా పై వాటి ప్రభావం (1724 – 1948 క్రీ.శ) పై చేసిన పరిశోధనకు నిజామాబాద్ వాస్తవ్యురాలు డి. శ్రావణికి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్ డీ ప్రకటించింది. ఇంట ర్మీడియట్ బోర్డు లో డిప్యూటీ సెక్రెటరీ గా పనిచేస్తున్న డి. మోహన్ కూతురు డి. శ్రావణి, ప్రస్తుతం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ మహిళ కళాశాల కామారెడ్డి చరిత్ర విభాగం లో అధ్యాపకురాలి గా పనిచేస్తు న్నారు.

టీ.యస్.పి. యస్సి 2017 గురుకుల డిగ్రీ అధ్యాపకుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో చరిత్ర సబ్జెక్ట్ విభాగం లో రాష్ట్ర స్థాయి లో 4 వ రాంక్ సాధించి 2019 నుండి కామా రెడ్డి లో విధులు నిర్వహిస్తున్నా రు. 2017 లో దేశస్థాయి యుజిసి నెట్ జే.అర్.ఎఫ్ పరీక్షల్లో ఎంపిక అయ్యి, 2018 లో జే.అర్.ఎఫ్ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగం లో ప్రొఫెసర్ జి. అంజయ్య పర్యవేక్షణలో పిహెచ్. డి లో ప్రవేశం పొందారు. పిహెచ్ డి సాధించిన శ్రావణిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement