Friday, April 26, 2024

Spl Story : కటకం సుదర్శన్.. ప్రస్థానం ఇదే

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ కన్నుమూశారు. గత నెల 31న మధ్యాహ్నం గుండెపోటు రావటంతో పాటు డయాబెటిస్ కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడి మృతి చెందిన్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కటకం సుదర్శన్ మరణంపై పార్టీ కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్ట్ 3వ,తేదీ వరకు కటకం సుదర్శన్ ను స్మరించుకుంటు సంతాప సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

కటకం సుదర్శన్ ప్రస్థానం :

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కార్మిక కుటుంబంలో కటకం సుదర్శన్ జన్మించారు. బెల్లంపల్లిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వరంగల్‌లో పాలిటెక్నిక్ చదువుకున్నారు. ఆ రోజుల్లోనే సుదర్శన్ మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా చేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో సుదర్శన్ కీలక పాత్రను పోషించారు. ఆ తరువాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా సుదర్శన్ పనిచేశారు. ఈ సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో సుదర్శన్ చురుకైన పాత్ర పోషించారు.

- Advertisement -

1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్‌గా, రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి కటకం ప్రాతినిథ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన, 2001లో రెండోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సుదర్శన్ సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా 2017 వరకు పనిచేశారు. అనంతనరం పలు అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతనరం పలు అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గెరిల్లా పోరాటంలో దిట్ట అయిన కటకం సుదర్శన్‌ను ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పిలుస్తారు. కటకం సుదర్శన్ మావోయిస్టు పార్టీ బలోపేతం కోసం అవిరామ పోరాటం చేశారు. షుగర్ వ్యాధి కారణంగా సుదర్శన్ సతమతమై, చివరకు హార్ట్ ఎటాక్ తో కన్ను మూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement